Breaking News

మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం

-ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కు వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ
-మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్ట‌ర్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌తిష్టాత్మ‌క మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పూర్తి
స‌హాయ స‌హ‌కారాలందిస్తుంద‌ని త‌న‌ను క‌లిసిన నూత‌న ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు
వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు. శుక్ర‌వారంనాడు వెల‌గ‌పూడి ఎపి స‌చివాల‌యంలో మంత్రిని ఆయ‌న మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భౌగోళికంగా మంగ‌ళ‌గిరిలోని సుంద‌ర‌మైన, ఆహ్లాదభరితమైన కొండ‌ల నడుమ ఎయిమ్స్ ను కేంద్ర‌ప్ర‌భుత్వం నెల‌కొల్పింద‌న్నారు. 2018లో ప్రారంభ‌మైన దీనికి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంచి నీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించ‌లేద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించింద‌ని, అలాగే ప్ర‌త్యామ్నాయ విద్యుత్ స‌ర‌ఫ‌రాను కూడా క‌ల్పించింద‌న్నారు. 183 ఎక‌రాల్లో ఏర్పాటైన ఎయిమ్స్ లో ట్రామా కేర్ సెంట‌ర్ ఏర్పాటుకు స్థ‌లం లేనందున‌, కొల‌నుకొండ‌లో 10 ఎక‌రాల స్థ‌లాన్ని మంజూరు చేసేందుకు ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబు నాయుడు ఇటీవలే ఆదేశాలిచ్చార‌న్నారు. త్వ‌రిత‌గ‌తిన ట్రామాకేర్ సెంట‌ర్‌ను నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని, అలాగే 965 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా మంజూరైన ఎయిమ్స్ లో ప్ర‌స్తుతం 650 ప‌డ‌క‌లున్నాయ‌ని, విస్త‌ర‌ణ‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ శాంతాసింగ్‌కు ఈ సంద‌ర్భంగా మంత్రి సూచించారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అభివృద్ధికి భ‌విష్య‌త్తులో అన్ని విధాలా స‌హ‌క‌రించేందుకు కూట‌మి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *