Breaking News

ఢిల్లీ లో బిజెపి గెలుపు తో అంబరాన్ని తాకిన సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో బిజెపి గెలుపు తో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకేలా విజయోత్సవాలు నిర్వహించారు.
కౌంటింగ్ లో బిజెపి తొలి నుంచీ బిజెపి మెజారిటీ సాధిస్తూ ఉండడంతో బిజెపి నేతలు బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి గెలుపు ఆస్వాదించారు. ఈసందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఆప్ ముసుగులో ఉన్న వామ పక్ష భావజాలం పై గెలుపు గా బిజెపి స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు గుండు సున్నా మిగిలిందని బిజెపి పేర్కొంది. ఢిల్లీ గడ్డ బిజెపి అడ్డా అంటూ బిజెపి శ్రేణులు నినాదాలు చేశారు. అవినీతి లో కూరుకు పోయిన ఆప్ కు ఢిల్లీ ప్రజలు తగిన శాస్తి చేశారని పేర్కొంది. ఢిల్లీ ప్రజలు మనసు ను నరేంద్ర మోడీ దోచారని బిజెపి నేతలు పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు మీడియా తో మాట్లాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *