పి.బి.సిద్ధార్థ ఫిజిక్స్ శాఖ సింటిలా పోస్టర్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పి.బి. సిద్ధార్థ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే సింటిలా 6.0 కార్యక్రమం పోస్టర్ ను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఐ.క్యు.ఎ.సి. కన్వీనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజిక్స్ శాఖాధిపతి, సింటిలా సమన్వయకర్త డా. టి. శ్రీనివాసకృష్ణ, భౌతికశాస్త్ర అధ్యాపకులు టి.పూజిత, డా. ఎస్కే ముస్వరీన్, జె.పాండురంగారావు, ఎన్.రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింటిలా కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులకు పి.పి.టి, క్విజ్, సైన్స్ మోడల్స్, వక్తృత్వం, సైన్స్ ట్రెజర్ హంట్, సంగీత, నృత్య, ఫొటోగ్రఫీ పోటీలను ఈ బుధవారం నిర్వహిస్తామని భౌతికశాస్త్ర శాఖాధిపతి, సింటిలా సమన్వయకర్త డా. టి. శ్రీనివాసకృష్ణ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *