-ఆర్ ఎస్ ఆర్ కి క్షేత్ర స్థాయిలో కొలతలు సరిపోవాలి
-నిర్దేశించుకున్న సమయపాలన లోగా రీ సర్వే పూర్తి చేయాలి
-రీ సర్వే పూర్తి చేసే బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం తాళ్లపూడి సచివాలయం లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , ఆర్డీవో రాణి సుస్మిత, సర్వే అధికారి తో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ సర్వే రికార్డ్ క్షేత్ర స్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో రెండు రికార్డ్ ల వివరాలు సరిపోవాలని, సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం , వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు పై వివరణ కోరడం జరిగింది. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. జియోలొకేషన్ రికార్డ్ , ఇమేజ్ ఫీచర్‌లను ధృవీకరించడానికి భూమిపై వాస్తవికత ఆధారంగా గ్రౌండ్ ట్రూటింగ్ సహాయపడుతుందన్నారు. గ్రౌండ్ ట్రూటింగ్ ద్వారా భూముల సరిహద్దులను గుర్తించడం సులభతరం చేస్తుందని, ఎటువంటి వివాదాలు తావులేకుండా పారదర్శకంగా ఉండేలా తోడ్పాటు పడుతుందని తెలిపారు. కొలతల ప్రకారం లేని పక్షంలో ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది, సంబంధించిన యజమానులకు నోటీసు జారీ చేసి వాస్తవ భూ కొలతలు ఆధారంగా సర్వే నెంబర్ లో ఉన్న భూమి సరిపోవాలని స్పష్టం చేశారు.
రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను , మార్గదర్శకాలు మేరకు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. రీ సర్వే లో అభ్యంతరాలు ఉంటే వాటిని అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలని , ఆమేరకు పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఈరోజుకి ఆరోజు క్షేత్ర స్థాయి లో సర్వే వివరాలు, సర్వే రికార్డులను అనుసరించి బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో పెరవలి మండలం క్షేత్ర స్థాయి సర్వే సిబ్బంది, రెవిన్యూ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News