విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాపు నాయకులు బేతు రామ్మోహన్ మరణం కాపులకు తీరనిలోటని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దశరధ రామిరెడ్డి అన్నారు. మహా కుంభమేళా కు వెళ్ళి గుండె పోటుతో అకాల మరణం చెందడం తీవ్రంగా కలచివేసింద న్నారు. ఈ సందర్భంగా బేతు రామ్మోహన్ సంతాప సభ సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ మేరకు ఆల్ ఇండియా జైహింద్ పార్టీ జాతీయ అధ్యక్షులు దశరధ రామిరెడ్డి మాట్లాడుతూ కాపునాడు జిల్లా అధ్యక్షుడిగా సామాజిక స్పృహ తో కాపు వర్గాల అక్షరాస్య తకు విశేష కృషి చేశార న్నారు. సామాజిక ఉద్యమాలలో యాక్టివ్ గా ఉండేవారని, ఆయన వారి సమస్యల కోసం పాటుపడిన వ్యక్తి, ఎల్లప్పుడూ కాపు సంక్షేమానికి క్రమశిక్షణతో నిబద్ధతతో కలిగిన, పోరాట ఉద్యమ కారు నిగా ప్రతిమ కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. కాపులకు పెద్ద ఎత్తున గుర్తింపు రావాలని వారిని ఓసిలో ఉన్నవారిని బీసీ లో చేర్చాలని రాజకీయా లకు ఆతీతంగా అన్ని కులాలు, మతాలతో కలిసి వారి హక్కుల కోసం పోరాటం చేసేవారని ఆయన తెలిపారు. ఈ సమాజం కోల్పోయిన ఆణిము త్యాలలో ఒకరు బెతు రామ్మోహన్ అని కొనియాడారు. ఈ సందర్భంగా బేతు రామ్మోహన్ కి పార్టీ నాయకులు పెద్దలు సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయ వాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి ఫణి రాజ్, టిడిపి సెంట్రల్ ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివ రావు, పోతుల బాలకోట య్య, వీరబాబు తదితరు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News