గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల కలెక్టర్లు , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి వి. కరుణ గారి సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. అందులో 30 మంది అభ్యర్డుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని , పది మంది నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. నామినేషన్లు ఉప సంహరించుకునేందుకు ఫిబ్రవరి 13 వ తేది చివరి రోజు అన్నారు. ఎన్నికల నిర్వహణపై పి ఓ లు , ఏపిఓ లు మరియు అదర్ పిఓ లకు ఈ వారంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించడం , ఎన్నికల అనంతరం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలింపు పకడ్బంధీగా చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటర్ జాబితా ప్రింటింగ్ , డిస్ట్రిబ్యూషన్ , బ్యాలెట్ పేపర్ ముద్రణా జిల్లా ఎన్నికల అధికారి , గుంటూరు వారు చేపట్టడం జరుగుతుందన్నారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లను ప్రధాన ఎన్నికల అధికారి వారితో సమన్వయం చేసుకొని చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డిఆర్ఓ షేక్. ఖాజావలి , పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News