Breaking News

శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం అభ్యర్డుల సమక్షంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి వి. కరుణ , రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ చేపట్టడం జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనలో 30 మంది అభ్యర్డుల నామినేషన్లను అంగీకరించడం జరిగింది. పది మంది అభ్యర్డుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. ఇందుకు సంబంధించి వ్యాలిడ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ జాబిత జతపరచడం జరిగింది.
నామినేషన్ల పరిశీలనా కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డిఆర్ఓ షేక్. ఖాజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, కలక్టరేట్ ఎన్నికల విభాగ సిబ్బంది , అభ్యర్డులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *