-ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి.
-కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వ హించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత సూచించారు. మంగళవారం పెరవలి మండలంలో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత మాట్లాడు తూ ఫిబ్రవరి 27 న పోలింగ్ కు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో 750 నుంచి 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి విధులు నిర్వహించే అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా సజావుగా నిర్వహించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నా రు. పెరవలి మండలం లో మూడు పోలింగ్ స్టేషన్లో 1927 మంది ఓటర్లు ఉండగా పురుషుల ఓటర్లు 1110, మహిళా ఓటర్లు 817 మంది ఉన్నారని ఆర్డీవో తెలిపారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పిఓ,ఏపిఓలకు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, త్రాగునీరు, విద్యుత్ , షామియానాలు, ర్యాంపులు, టాయిలెట్, టెలిఫోన్, తదితర వసతులను కల్పించడం జరుగుతుం దన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తాహిసిల్దార్, డి.అచ్యుతాకుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News