Breaking News

ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ లో భాగంగా మంగళవారం ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నిర్వహించిన జనరవ్ విభాగంలో 3326 మందికిగాను 3285 మంది హాజరై 41 మంది గైర్హాజరు అయినారని, మధ్యాహ్నం 2991 మందికీ గాను 2967 మంది హాజరై 24 మంది గైర్హాజరు అయినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ఎస్విఎల్ నరశింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

వొకేషనల్ విభాగంలో ఉదయం 755 మందికి గాను 679 హాజరు కాగా 76 మంది గైర్హాజరైనారని, మధ్యాహ్నం 595 మందికి గాను 577 మంది హాజరై 18 మంది గైర్హాజరైనారని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలోను ప్రాక్టికల్ పరీక్షల ప్రశాంతంగా జరిగే అని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *