Breaking News

నవ చేతన తో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్

-విద్యార్థులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సుజనా ఫౌండేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో నానాటికి పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు కే బీ ఎన్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ , క్రిస్ప్, మరియు ఎస్ పి వై ఎమ్ , అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో ఆవరణలో మంగళవారం డ్రగ్ అవేర్నెస్ మరియు లైఫ్ స్కిల్స్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. “నవచేతన “అనే సరికొత్త కార్యక్రమంతో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు.

మూడు రోజులు పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పశ్చిమ లోని వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చెడుసావాసాలకు అలవాటు పడకుండా, పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలను గురుంచి మరియు లైఫ్ స్కిల్స్ గురించి నిపుణులైన ట్రైనర్స్ బృందం సందేశహాలను నివృత్తి చేసే కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీకి చెందిన సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ యూత్ అండ్ మాసేస్ (యస్ పి వై ఎం) ఢిల్లీకి చెందిన సంస్థ ప్రతినిధి ట్రైనర్ గ్యారీ రైడ్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాల వినియోగం పట్ల,జీవిత నైపుణ్యాల పై అవగాహన కల్పించడం వలన భవిష్యత్తులో వివిధ పరిస్థితులలో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడం నేర్చుకుంటారని తెలిపారు. తద్వారా వారిలో సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి శిక్షణను ఇవ్వటం ద్వారా వారిలో ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందన్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు మరియు పొగాకు వినియోగం వల్ల జరిగే నష్టాలను గురించి వివరించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సిబ్బంది, క్రిస్ప్ టీం,మరియు యస్ పీ వై ఎమ్ ట్రైనర్లు మనీష్ కుమార్, బిలాల్ అహ్మద్, సునీల్ కుమార్ వివిధ పాఠశాలల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *