Breaking News

న్యూ టయోటా క్యామ్రి విజయవాడ మార్కెట్లో విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా కంపెనీ తమ సరికొత్త ప్రీమియం సెడాన్‌ క్యామ్రిను మంగళవారం ఎనికేపాడు, లక్ష్మీ టయోటా షోరూంనందు కెనరా బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రవికుమార్‌ సిన్హా, లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేసారు.
ఈ సందర్భంగా లక్ష్మీ టయోటా సేల్స్‌ జనరల్‌ మేనేజర్‌ రాఘవప్రసాద్‌ మాట్లాడుతూ టయోటా నూతనంగా ప్రవేశపెట్టిన ఈ న్యూ క్యామ్రి కారు శక్తివంతమైన 2.5 లీటర్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 230 హార్స్‌ పవర్‌ మరియు 25.49 కెఎంపిఎల్‌ మైలేజ్‌ ఇస్తుందని తెలియచేసారు. అద్భుతమైన ఎక్సటెరియర్‌ లుక్స్‌తో పలు ఆధునాతమైన టెక్నాలజీ మరియు విశాలవంతమైన ఇంటీరియర్స్‌, 9 ఎయిర్‌ బాగ్స్‌ మరియు టయోటా సేఫ్టీ సెన్స్‌లాంటి అనేక భద్రతా ప్రమాణాలు కలిగివుందన్నారు. ఈ కారు ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ.48,00,000 అని తెలిపారు. ఇది ఆకర్షణీయమైన 6 రంగులలో లభిస్తుందని తెలిపారు. ఈ నూతన క్యామ్రి బుకింగ్స్‌ ప్రారంభమైనవని, వివరాలకు షోరూం నందు సంప్రదించవలసిందిగా రాఘవప్రసాద్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ టయోటా సర్వీస్‌ జనరల్‌ మేనేజర్‌ పవన్‌, మరియు ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *