మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడి కేంద్రాలలో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఎంపీ ల్యార్డ్స్(MPLADS), డిస్టిక్ మినరల్ ఫండ్ (డిఎంఎఫ్,) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడీలలో టాయిలెట్లు, త్రాగునీటి అవసరాలకు చేపడుతున్న పనుల ప్రగతిని మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్ డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి పెండింగ్ లేకుండా పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలి అన్నారు. ఇప్పటికే 90% పైగా పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణ నీటి సరఫరా అధికారులు కలెక్టర్ కు వివరించారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి చెల్లింపులు చేయాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, గ్రామీణ నీటి సరఫరా జిల్లా అధికారి డిడిఎన్ నటరాజ్, ఆర్డబ్ల్యూఎస్ డిఇలు, మండలాల జూనియర్ ఇంజనీర్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News