గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
షబ్ ఈ బరాత్ పండుగ సందర్భంగా ముస్లిం శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఇంజనీరింగ్, ప్రజరోగ్యాదికారులను ఆదేశించారు. బుధవారం సంగడిగుంటలోని ముస్లిం శ్మశానవాటికను పరిశీలించిన కమిషనర్ తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గురువారం షబ్ ఈ బరాత్ పండుగ సందర్భంగా నగర పాలక సంస్థ పరిధిలోని ముస్లిం శ్మశాన వాటికల్లో మౌలిక వసతులైన త్రాగు నీరు, పారిశుధ్యం, షామియాన, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడానికి దృష్టి సారించాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు పర్యవేక్షణకు ఎమినిటి కార్యదర్శులను కేటాయించాలని ఆదేశించారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ టి.వెంకటకృష్ణయ్య, యస్.ఈ నాగమల్లెశ్వరావు, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ అమృతం, ఈ.ఈ సుందర రామి రెడ్డి, ఎ.డి.హెచ్ శ్రీనివాస్, డి.సి.పి సూరజ్ కుమార్, ఆర్.ఓ సాదిక్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News