Breaking News

మూడో రోజు ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు

-తొలి మ్యాచ్ లో తమిళనాడు జట్టుపై నెగ్గిన కేరళ టీం
-రెండో మ్యాచ్ లో ఆంధ్రా-తెలంగాణ జట్టుపై సునాయసంగా గెలుపొందిన కర్ణాటక టీం
-గురువారం ఉదయం 9.30 గం.లకు కర్ణాటక, కేరళ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
-టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు

అమరావతి / మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 లో భాగంగా మూడో రోజు జరిగిన రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ తమిళనాడు, కేరళ జట్ల మధ్య జరగగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల జట్టు, కర్ణాటక రాష్ట్ర జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేరళ, కర్ణాటక జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్ ల్లో విజేతలుగా నిలిచి ఫైనల్ కు చేరడం విశేషం.

ఉదయం కేరళ, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన కేరళ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు టీం నిర్ధేశిత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. బ్యాట్స్ మెన్ వేదాంత్ భరద్వాజ్ ఈ మ్యాచ్ లో కూడా తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ 56 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లతో అత్యంత వేగంగా 81 రన్స్ చేశారు. అంకిత్ మిశ్రా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య సాధనకు దిగిన కేరళ జట్టు కేవలం 17.4 ఓవర్లలో భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. కేరళ బ్యాట్స్ మెన్ సచిన్ సురేష్ కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 62 పరుగులు చేయగా, అతనికి పోటాపోటీగా ఎంఎస్ అఖిల్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు కొట్టి 55 పరుగులు చేసి మ్యాచ్ ను విజయపథం వైపు నడిపించారు. తమిళనాడు బౌలర్ విఘ్నేష్ 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశారు.

మధ్యాహ్నం ఆంధ్రా- తెలంగాణ వర్సెస్ కర్ణాటక మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత కర్ణాటక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ జట్టు లో బ్యాట్స్ మెన్ ఎస్. తరుణ్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 36 పరుగులు చేశారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ జట్టు ను పరుగులు చేయనీయకుండా ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ కర్ణాటక టీం స్కోర్ ను కట్టడి చేసింది. కర్ణాటక బౌలర్లు ఏఎం. కిరణ్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, అర్జున్ గౌడ 3 వికెట్లు తీసి 38 పరుగులు ఇచ్చారు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కర్ణాటక టీం మరో 15 బాల్స్ మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో నిర్ధేశిత లక్ష్యం ఛేదించి విజయం సాధించింది. కర్ణాటక టీంలో బ్యాట్స్ మెన్ జె.సుచిత్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఆంధ్రా-తెలంగాణ జట్టులో కె.భీమా రావు 3 ఓవర్లలో 29 పరుగులు సమర్పించుకొని 2 వికెట్లు తీశారు.

సెమీఫైనల్ మ్యాచ్ లో గెలిచిన కర్ణాటక, కేరళ టీం ల మధ్య గురువారం ఉదయం 9.30 గం.లకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటి నుండి కర్ణాటక, కేరళ జట్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ టీంలను గెలిపిస్తూ వచ్చారు. గురువారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో విజయం ఏ జట్టును వరిస్తుందో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న సౌత్ జోన్ టోర్నమెంట్ లో గురువారం మధ్యాహ్నం 12.30 గం.లకు జరిగే ముగింపు వేడుకకు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా మంగళగిరి స్టేడియానికి విచ్చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించి వారి చేతుల మీదుగా విజేతగా నిలిచే జట్టుకు ఛాంపియన్ ట్రోఫీని అందజేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *