Breaking News

వాహనం కండిషనే కాదు మనం కూడా కండిషన్ లో ఉండాలి

-తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఆర్టీవో వెంకటేశ్వరరావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాహనాలు నడిపేవారు విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీవో కే. వెంకటేశ్వరరావు అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న వాహన పటుత్వ కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్టీఓ వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ వాహనాలను కండిషన్ లో ఏలా అయితే ఉంచుతామో, అలానే వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా మీ ఆరోగ్యాన్ని కండిషన్లో ఉంచుకోవాలన్నారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఏదైనా సమస్య ఉన్నా కూడా ముందుగానే తెలుస్తుంది అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే సక్రమంగా వాహనాన్ని నడపగలుగుతారని ఆయన చెప్పారు. రహదారి భద్రత మసోత్సవాలు సందర్భంగా డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని వెంకటేశ్వరరావు తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించిన డ్రైవర్లను ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందాలని చెప్పామన్నారు. ఆయుష్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. గుండె సంబంధిత రోగాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముందుగా పరీక్షలు చేయించుకుని మందులు వాడితే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. కార్మికులకు వైద్య సేవలు అందించడానికి తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు మందులను సంధ్య కంటి ఆసుపత్రి సౌజన్యంతో అందించమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంవిఐలు వై. నాగేశ్వరరావు, వి పద్మాకర్, జి.వి.ఎస్. ఎన్. మూర్తి, శివరాం గౌడ్, ఉదయ శివప్రసాద్, డివి రమణ, ఎండి అలీ పాల్గొన్నారు. ఆయుష్ హాస్పటల్, గుండె వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్, సంధ్య కంటి ఆసుపత్రి వైద్యులు అనురాధ, మంగపతి కార్మికులకు వైద్య సేవలు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *