గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం ఏర్పాట్లపై ఈ రోజు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ వివిధ అధికారులతో సమీక్షించారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో జరగనున్న ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమంపై జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా యువత చదువుతూ పాటు సామజిక రంగంలో సేవ చేసే అవకాశం రావడం మంచి పరిణామం అన్నారు. వ్యవసాయ, నాబార్డ్, లీడ్ బ్యాంకు, ఆరోగ్య, డీఆర్డీఏ డిపార్టుమెంట్లను ముందుగా మై భారత్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, వారి డిపార్ట్మెంట్స్ ద్వారా కనీసం 20 మంది యువతకు 120 గంటలు ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకు రావాలని, ఆ అనుభవంతో మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేట్లు చూడాలని, గ్రామాలలో ఉన్న యువజన సంఘాలు యువత ఎన్ఎస్ ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేట్లు చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సమీక్షలో గుంటూరు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి, డి ఎం ఎచ్ ఓ డా. కె విజయ లక్ష్మి, డి ఆర్ డి ఏ డైరెక్టర్ టి వి విజయ లక్ష్మి, ట్రాన్స్పోర్ట్ శాఖ నుంచి డిప్యూటీ కమిషనర్ అఫ్ ట్రాన్స్పోర్ట్ కె శ్రీహరి, ఆర్ టి ఓ బి సత్యన్నారాయణ ప్రసాద్ జిల్లా టూరిజం శాఖాధికారి ఏ శ్రీ రమ్య, జిల్లా ఇండస్ట్రియల్ సెంటర్, జిల్లా మేనేజర్ శ్రీమతి ఈ జయ లక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి ఎన్ వెంకటేశ్వర్లు, పోలీస్ శాఖనుంచి డి ఎస్ పి బి వి సుబ్బారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజిఎం జి శరత్ బాబు, మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యూనివర్సల్ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News