Breaking News

మార్గదర్శకాలు ప్రకారం బాధ్యతగా విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం బాధ్యతగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఉదయం ప్రిసైడింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు, మధ్యాహ్నం అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా , జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు జరిగే ముందు రోజు 26-02-2025 తేదీన ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రి స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు తీసుకొని వాటిని పూర్తిగా పరిశీలించుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 8 గంటల సమయానికి ఓటింగ్ ప్రారంభించేలా పోలింగ్ కేంద్రాల వద్ద నిర్దేశించిన విధంగా అభ్యర్థుల వివరాలు ఇతర పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. పోలింగ్ సమయం ముగిసే నాటికి పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ స్లిప్పులిచ్చి ఓటింగ్ కు అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు పూర్తిస్థాయిలో సీల్డ్ వేసి స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాలు సక్రమంగా పూర్తి చేసి ఏసీ కళాశాలలోని రిసెప్షన్ కేంద్రంలో భద్రంగా అందించాలన్నారు.
సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించవలసిన విధులు, బ్యాలెట్ బాక్సులు ఓటింగ్ కు సిద్ధం చేసే విధానం, సీల్డ్ వేసి విధానంపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్, వీడియో చిత్రాల ద్వారా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు.
సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తహశీల్దార్లు, సెక్టార్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *