Breaking News

జేఈఈ మెయిన్స్‌ లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులను అభినందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జేఈఈ మెయిన్స్‌ ఫేజ్-1లో 99.8% పర్సంటైల్ అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విజయవాడకి చెందిన అన్ అకాడ‌మి విద్యార్థులను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినందించారు. గురునానక్ కాలనీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం అన్ అకాడమి సెంట‌ర్ అక‌డ‌మిక్ హెడ్ న‌మ్మి నాగేంద్ర ఆధ్వ‌ర్యంలో జేఈఈ మెయిన్స్ అత్య‌ధిక మార్కుల‌తో స‌త్తా చాటిన విద్యార్ధులు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌లిశారు. విద్యార్ధుల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిపాల్ కాజా రామ కృష్ణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *