Breaking News

పి.బి. సిద్ధార్ధ కళాశాలలో జీవశాస్త్రాల సృజనశాల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యువతరం నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం అన్నారు. బుధవారం విజయవాడలోని పి.బి. సిద్ధార్థ కళాశాలలో జీవశాస్త్ర విభాగాలు (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జీవసాంకేతికశాస్త్రం) సంయుక్తంగా నిర్వహించిన సియన్షియా కార్యక్రమాన్ని ఆచార్య సింహాచలం ప్రారంభిస్తూ ప్రస్తుతం హాస్పిటల్ మేనేజ్ మెంటు, ఆక్వాకల్చర్ రంగాల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, జంతుశాస్త్ర విభాగాధిపతి, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. మనోరంజని, సియన్షియా కన్వీనర్, వృక్షశాస్త్రాధిపతి డా. పువ్వాడ శ్రీనివాసరావు, సహ సమన్వయకర్త డాక్టర్ సాంబానాయక్, అధ్యాపకులు డి.శ్రావణి, సిహెచ్. శిరీష, పి.లలితాప్రియాంక పాల్గొన్నారు. వివిధ డిగ్రీ కళాశాలల నుండి 300 మందికి పైగా విద్యార్థులు క్విజ్, పి.పి.టి., పోస్టర్, మిస్టర్ అండ్ మిస్ బయో తదితర పోటీల్లో పాల్గొని తమ సృజన చాటుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *