Breaking News

నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాఘవయ్య పార్క్, పంజా సెంటర్, e 3 ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో నైట్ డ్రైవ్  నిర్వహించి నిరాశ్రయులందరికి ఆశ్రయాన్ని కల్పించాలని, వారిని విజయవాడ నగరపాలక సంస్థ వారి నైట్ షెల్టర్ హోమ్స్ కి తరలించాలని, యు సి డి విభాగం సిబ్బంది  ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పంజా సెంటర్, e 3 ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. నగరాన్ని సుందరంగా ఉంచాలని పారిశుద్ధ్య  నిర్వహణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో  చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, సూపరిండెంటింగ్  ఇంజనీర్  పి సత్యకుమారి,  జాయింట్ డైరెక్టర్ (అమృత్) లత, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *