-తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలూరు కలెక్టరేట్ వి.సి. హాలునుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, తదితరులతో ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పీ.ఏస్.కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజవకర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారని, దానికి సంబంధించి 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలకు 70 జోన్లు ఏర్పాటు చేయగా అందుకు సంబంధించి 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంసిసి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించు కోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలన్నారు. జిల్లా, డివిజనల్ స్ధాయిలో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు పటిష్టంగా ఉండాలన్నారు. ఏలూరులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ అనంతరం పకడ్బందీ ఏర్పాట్లతో, పటిష్ట బంధోబస్తుతో ఏలూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం కి చేర్చాలన్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లకు మొదటి విడత పోలింగ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
సమావేశంలో ఆయా జిల్లాల నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు,సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా ఏలూరు నుంచి సహాయ రిటర్నింగ్ అధికారి వి. విశ్వేశ్వరరావు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, పలువురు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News