-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) పూర్తి స్థాయి లో నియంత్రణ లోకి రావడం జరిగిందని, వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్స్ ప్రకారం చేర్యాలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ నంద్ , ఇతర సమన్వయ ఉన్నతాధికారులతో “ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా “ పై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పశు సంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా పౌల్ట్రీలో ఇన్‌ఫెక్షన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ సోకిన ప్రాంతాలను గుర్తించి, ప్రొటోకాల్ ప్రకారం తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2976 కోళ్లను కోర్లింగ్ చెయ్యడం జరిగిందని తెలిపారు. కానూరు అగ్రహారం ప్రాంతంలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తుంచి అక్కడి పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలను అప్రమత్తం చేశామని తెలిపారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా నుంచి 18 శాంపిల్స్ సేకరించి పంపడం జరిగిందని, అన్ని కూడా నైగిటీవి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఆశా, ఏ ఎన్ ఎం బృందాలను ఇంటింటికి పంపి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 17 ర్యాపిడ్ రెస్పాండ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తామని, రానున్న మూడు నెలల్లో ఈ పరీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కోళ్లరవాణా వ్యవస్థ పై దృష్టి సారించి, వాటిని నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు, స్కూల్స్ కి సరఫరా నిలుపుదల చేసామని, వీటికి ప్రత్యామ్నాయం లక్షణాలు లేని, ఇతర ప్రాంతాలను గుర్తించి సరఫరా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియా చేశారు.
ఇది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి కాదు మరియు మాంసం మరియు గుడ్లు వండడం వల్ల వైరస్ నాశనం అవుతుందని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
హెల్త్ డ్యూటెమెంట్ ద్వారా తీసుకున్న ఏర్పాట్లు మరియు చర్యలు
ICMR ద్వారా తెలియజేయబడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SoPలు) అన్ని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారులకు ఒక ఎయిర్ట్‌గా పంపిణీ చేశామన్నారు..
అన్ని ఆరోగ్య కేంద్రాలలో యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రభావిత పౌల్ట్రీ ఫారమ్‌ల దగ్గర ఇంటింటికి సర్వే నిర్వహించడం (పట్టణ ప్రాంతాల్లో 1 కిమీ వ్యాసార్థం మరియు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిమీ వ్యాసార్థం తగిన ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
సర్వే సమయంలో ఏవైనా రోగలక్షణ కేసులు గుర్తించబడితే, వాటిని సమీపంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి సూచిస్తారు మరియు యాంటీవైరల్ ఔషధాల కోసం సలహా ఇస్తారు మరియు ఐసోలేషన్‌లో ఉంచబడతారు. పీసీఆర్ పరీక్ష చేయించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
పౌల్ట్రీలో పనిచేసే వ్యక్తులు ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరిశీలనలో ఉంచుతారు. ప్రోటోకాల్ ప్రకారం, లక్షణం లేని కేసులకు కూడా పరీక్ష చేయబడుతుందని, జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్ధక అధికారి కే శ్రీనివాస రావు, డి ఎం హెచ్ ఓ కే. వెంకటేశ్వర రావు హాజరు అయ్యారు.
Prajavartha Online Telugu News