రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అత్యంత కీలకం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ మందిరంలో 14 వ జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్ష తన జరిగింది. తొలుత సమావేశంలో 13 వ డి ఐ ఈ పి సి సమావేశంలోని చేర్య లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే ఆయా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం స్థానికంగా ఉన్న పరిశ్రమల అవసరాలను గుర్తించి, వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ కింద వచ్చే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ పంపిణీ కి సిద్దంగా ఉన్నామని, లోడ్ కి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు తెలియ చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశామని తెలిపారు. స్థానికంగా హోమ్ స్టే , బెడ్ సైడ్ సహాయకులు, పర్యాటకం , సేవారంగం వంటి కార్యక్రమాలు శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని తెలిపారు. హోమ్ స్టే వనరబుల్ ప్రాంతాలను గుర్తించి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ వనిదర్ రామన్, ఏపీ ఐ ఐ సి జెడ్ ఎం ఏ. రమణ రెడ్డి, డిఆర్డిఏ పిడి ఎన్ వి ఎస్ మూర్తి, ఎల్డిఎం డి వి ప్రసాద్, ఏపీ ఈపి డీసీఎల్ ఎస్ ఈ కే తిలక్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News