–ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంశీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు
–వంశీ ఆ ప్రాధాన్యతను మరచి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపైనే అసభ్యంగా మాట్లాడారు
–వంశీ అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమమేనని, వల్లభనేని వంశీ ఒక నేరాన్ని చేసి దాని కప్పిపుచ్చడానికి మరికొన్ని నేరాలకు పాల్పడ్డాడని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల గురువారం మధ్యాహ్నాం విలేకరుల సమావేశం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయని రాజకీయ అనుభవజ్ఞులు చెప్పేవారని దానికి వల్లభనేని వంశీ నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. గత టీడీపీ హాయంలో ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో కరెంట్ లైన్లు, విద్యుత్ మోటార్లు ఇలా ఏది అడిగినా వాటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంజూరు చేశారని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రులు అడ్డుచెప్పినా వారిని కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే వంశీ అడిగిన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా వంశీ అడిగిన అనేక పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీలోని కి వెళ్ళడానికి వంశీ నిర్ణయించుకున్న తర్వాత నారా చంద్రబాబునాయుడుని అనరాని మాటలు అనడం విని తాను తట్టుకోలేకపోయానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై అసభ్యంగా వంశీ మాట్లాడిన రోజున తాను కూడా అసెంబ్లీలో ఉన్నానని చెప్పారు. గన్నవరం నియోజకవర్గానికి తాను కూడా ప్రాతినిధ్యం వహించానని, ఆ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబునాయుడు కుటుంబం గురించి వంశీ అనరాని మాటలు అన్న రోజు నుంచి ఆయనతో మాట్లాడేందుకు కూడా మనస్సు అంగీకరించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ను సందర్భంగా అభ్యర్థులను బెదిరించి ఎన్నికల ను ఏకపక్షం చేయడానికి వంశీ తీవ్రంగా ప్రయత్నించాడని, కానీ చాలా ప్రాంతాల్లో ఆయన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదన్నారు. వల్లభనేని వంశీ ఒక నేరాన్ని కప్పుపుచ్చుకోడానికి మరికొన్ని నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగి సత్యవర్థన్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి భయపెట్టారని యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీని అరెస్ట్ చేశారన్నారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే పోలీసులు వంశీని అరెస్ట్ చేశారని, తప్పు చేసిన వంశీని అరెస్ట్ చేస్తే వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు సక్రమంగానే ఉన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో వంశీ ప్రభావం తగ్గిపోయిందని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గం చాలాప్రశాంతంగా ఉంటుందని, అలాంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం సరికాదన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సొంత బాబాయ్ హత్య సంఘటనలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో, ఆ పార్టీలోని వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి బాబాయ్ హత్య సంఘటనలో జగన్‌తోపాటుగా చాలా మంది ఆయన అనుచరుల పై కూడా పోలీస్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇప్పుడు గన్నవరంలో జరిగిన సంఘంటనలో కూడా ఎస్సీ యువకుడి కిడ్నాప్‌కు పాల్పడిన వంశీతో పాటుగా ఆయన అనుచరులు అందరిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. వంశీ అరెస్ట్ అక్రమని చెబుతున్న వైఎస్సార్సీపీ నాయకులు గుండెల మీద చెయి వేసుకుని చెప్పాలన్నారు. తన నియోజకవర్గానికి సమీపంలో ఉన్న గన్నవరం నియోజకవర్గంలో కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ 2019–24 సంవత్సరం లో జరిగిన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులు, శ్రేణులకు వివాదాలకు పాల్పడవద్దని చెబుతూనే ఉన్నారన్నారు. వల్లభనేని వంశీమోహన్ టీడీపీలో పెరిగారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా వంశీ మాట్లాడారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబంపై వంశీ చేసిన వాఖ్యలు అందరికి తెల్సునని అన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడం సరికాదాన్నరు. వంశీ అరెస్ట్ సక్రమమేనని చెప్పారు. 2019–24 సంవత్సరాల మధ్య కాలంలో వైఎస్సార్సీపీ నాయకులు వారికి ఇష్టం వచ్చినట్గుగా నడిచారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అన్యాయంగా,అక్రమంగా వ్యవహారిస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.
ఈ సమావేశంలో కార్పోరేటర్ ముమ్మనేని ప్రసాద్, పేరేపి ఈశ్వర్, కలపాల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News