-ప్రతి సర్కిల్ పరిధిలో స్టాల్స్ తో అవగాహన పెంచండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు, దాని ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన వస్తువులు చూపించే ప్రత్యేక స్టాల్ ను సందర్శించారు. పర్యావరణహితమైన వస్తువులే వాడాలని, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజలకు, వినియోగదారులకు, అమ్మేవారికి, అవగాహన కల్పించే విధంగా ప్రతి సర్కిల్లో స్టాల్‌ను ఏర్పాటు చేయాలని ఒకసారి వాడే పడేసే ప్రతి ప్లాస్టిక్ వస్తువుకి ప్రత్యామ్నాయలు చూపిస్తూ సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లను కొలిచే స్క్రూ గేజ్ తో ప్లాస్టిక్ కవర్లను స్వయంగా తానే కొలిచి చూశారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను స్క్రూ గేజ్ తో కొలిచి చూశారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవకుండా పర్యావరణానికి హాని కల్పించేవని, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News