-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్ లలో పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం కొరకు విచ్చేసిన ప్రజలను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ భవనం మొత్తం పర్యటించి వాడుక నీరు, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా అని పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారం తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని. పారిశుధ్య నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరుపుతూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
Prajavartha Online Telugu News