Breaking News

పార్క్ లో సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్క్ కు వచ్చే సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, మదర్ తెరెసా జంక్షన్, వెటర్నరీ కాలనీ ప్రాంతాలని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వెటర్నరీ కాలనీలో ఉన్న పార్కును సందర్శించి, అక్కడ వచ్చిన ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంచేందుకు మరమ్మతులన్ని పూర్తి చేసి ప్రజలకు సత్వరంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. తదుపరి, ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న ప్లేగ్రౌండ్ పరిశీలించి, ప్రజలు ఆడుకునేందుకు వీలుగా ప్లే గ్రౌండ్ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.

టిక్కిల్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్ ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. డ్రైన్ ల లో పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ, తీసిన పూడికలన్నీ కూడా వెంటనే తీసేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ వ్యర్ధాలను చూసి ఎప్పటికప్పుడు తరలించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు మీద ఉన్న పాత వాహనాలను పోలీసువారి సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *