Breaking News

దామోదరం సంజీవయ్య కి ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిరత్నం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యానచంద్ర, దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య, 1960 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఆయన పాలనలో 1961 లో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం శంకుస్థాపన జరిగిందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా వంటి కీలక రంగాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలు అభినందనీయమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జామినర్ అఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, వియంసి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *