Breaking News

సమస్యలు ఆలకిస్తూ… ఆప్యాయంగా పలకరిస్తూ… అధికారులకు ఆదేశాలిస్తూ…

-ముసునూరు మండలం కాట్రేని పాడు గ్రామంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
-మంత్రి పార్థసారథికి అడుగడుగునా గ్రామ పెద్దలు తమ సమస్యలు మంత్రికి తెలియజేయగా తక్షణమే సమస్యలు పరిష్కరించిన మంత్రి,,..
-యాదవులు బజారులో సుమారు రూ,20 లక్షలతో కమ్యూనిటి హాలు నిర్మించే బాధ్యత నాది మంత్రి కొలుసు పార్థసారధి..

ముసునూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
కాట్రేని పాడు గ్రామంలో ఆదివారం ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గ్రామంలోని ప్రతీ వారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం గ్రామంలోని కొంతమంది వృద్ధులు తాము పేదరికంలో ఉన్నానని, తనకు స్వంత ఇల్లు లేదని, తనకు ఇల్లు మంజూరు చేయాలనీ కోరగా,తక్షణమే పరిశీలించి ఇంటి స్థలం మంజూరు చేయాలనీ రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమకు గతంలో టిడిపి ప్రభుత్వం సమయంలో పేదలకు స్థలాలు మంజూరు చేశారని , వాటిల్లో కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారని, కొంతమంది ఇల్లు ప్రారంభదశలో ఉండగా, తదనంతరం వచ్చిన వై.ఎస్.ఆర్.సిపి నాయకులు సదరు ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని, ప్రారంభ దశలో ఇళ్ల ఉన్నవాటిని కూడా నిర్మాణ పనులు పూర్తి చేయనివ్వలేదన్నారు. తమ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ సమస్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉందని, తాను ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, సదరు బిల్లులు చెల్లింపులకు, ప్రారంభ దశలో ఉన్న ఇళ్లకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గ్రామంలో స్వంత ఇల్లు లేని పేదల వివరాలు తనకు సమర్పించాలన్నారు. 2025, మార్చి నెల తరవాత కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్ కాస్ట్ ను 4 లక్షల రూపాయలకు పెంచుతుందని, ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
గ్రామలో గొల్ల గూడెం లో కమ్యూనిటీ హాలు నిర్మించసాలని కోరగా రూ,20 లక్షలతో త్వరలో యాదవులు బజారులో మంచి కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మంత్రి, మరికొంత మంది పెద్ద చెరువు పూడికలు తీయమని అడగగా తక్షణమే పూడిక పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారికి ఆదేశించిన మంత్రి, గ్రామంలో కొంత మంది డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా పాడైనదని మరమ్మత్తులు చేయాలని కోరగా తక్షణమే రూ,40 లక్షల నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సంబదిత అధికారికి ఆదేశించిన మంత్రి, గ్రామంలోని కొంతమంది వృద్ధులు ఫెంక్షన్ రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకొని రాగా వెంటనే సంబంధిత అధికారులకు హర్హులైన ప్రతీ ఒక్కరికి ఫెంక్షన్ మంజూరు చేయాలని ఆదేశించిన మంత్రి కొంతమంది ఈ. కి ఆదేశించిన మంత్రి పట్ల తమ హర్షాన్ని కృతజ్ఞతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, కూటమి నాయకులు, మాజీ సర్పంచ్ ,కూటమి నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *