Breaking News

తిరునాళ్ళు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం వద్ద క్వారీ లోని శ్రీ బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ళు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు , క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో చేపట్టాలని తెనాలి సబ్ కలెక్టర్ వి. సంజనా సింహా అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం వడ్లమూడి లోని శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26 వ తేదీన జరిగే మహా శివరాత్రి పండుగ సందర్బంగా జరిగే క్వారీ తిరునాళ్ళ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తిరునాళ్ళు జరిగే విధానం , అవసరమైన ఏర్పాట్లు , భక్తుల , సందర్శకుల రాక తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ళు జరిగే ఫిబ్రవరి 24 , 25 తేదీలలో రెండు లక్షలకు పైగా భక్తులు , ప్రజలు సందర్శిస్తారనే అంచనా వుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకోటేశ్వర రావు వెల్లడించారు. తొలి రోజు పశువుల ప్రదర్శనలు , రెండవ రోజు వాహనాల ప్రదర్శనలు , పొంగళ్ళ మొక్కుబడులు వుంటాయని తెలిపారు. 26 వ తేది శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులు దర్శించుకుంటారని , మహిళా భక్తులు పొంగల్లు పెట్టుకుంటారని తెలిపారు. తిరునాళ్ళ లో ఏర్పాటు చేసే చలువ పందిళ్ళు తాటి ఆకులతో వేస్తారని , పొంగల్లు పెట్టే పందిళ్ళ వద్ద అగ్నిమాపక శకటాన్ని సిద్దంగా వుంచాలని తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారి మస్తాన్ వలి మాట్లాడుతూ పొంగళ్ళ పందిళ్ళ వద్ద నాలుగు ఫైర్ ఎక్సేజంర్లను ఏర్పాటు చేస్తామని , వెయ్యి గ్యాలెన్ల సామర్ధ్య గల వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గొడవర్రు నుండి -1 , గుండవరం నుండి -3 , నారాకోడూరు నుండి -3 నుండి భారీ విద్యుత్ ప్రభలు తరలి వస్తాయని విద్యుత్ శాఖఅధికారులు తెలియజేశారు. దేవాలయం వద్ద సీసీ కెమెరాలు , లైటింగ్ ఏర్పాట్లు , రోడ్డుకు ఇరువైపులా లైటింగ్ , ప్రభల వద్ద ఎలక్ట్రికల్ టవర్ చేస్తామని విద్యుత్ శాఖ ఏ. ఇ శ్రీనివాస రావు తెలిపారు. దేవాలయం వద్ద భక్తుల రద్దీ నివారణకు ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు , భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా చూస్తామని ఆలయ ఈఓ తెలిపారు. క్యూ లైన్లో వేచి వుండే భక్తులకు మంచినీరు , మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్ అవుట్ పోస్టు ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసి మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. తురునాళ్ళ కు వచ్చే భక్తులకు నాలుగు ప్రాంతంలో మినరల్ వాటర్ ట్యాంకర్లు , 20 మొబైల్ టాయిలెట్స్ ను , 40 డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డివిజనల్ పంచాయితీ అధికారి తెలిపారు. షిఫ్ట్ కు పది మంది సిబ్బందితో మూడు షిఫ్ట్ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు , అంబులెన్స్ , స్టేక్చర్ , 104, 108 వాహనాలు , మందులు అందుబాటులో వుంచడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. తిరునాళ్ళకు ఐదు కిలో మీటర్ల దూరంలో వున్న మద్యం షాపులను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకారం ఈ నెల 25 వ తేది నుండి మూసి వేయడం జరుగుతుందని , అనాధరైజ్డ్ షాపులు , అవుట్ లెట్స్ లేకుండా మూడు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని , ఒక్కొక్క మొబైల్ పార్టీలో ఐదు మంది సిబ్బంది వుంటారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డీజే శబ్ద కాలుష్యాని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సూచించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామి వారికి పూజా సామాగ్రి తీసుకువచ్చే వాహనాలను పోలీస్ సిబ్బంది ఆపుతున్నారని సంయుక్త కలెక్టర్ కు తెలియజేయగా , పోలీస్ రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభల నిర్వాహకుల నుండి సూచనలు కోరగా, నారాకోడూరు కు చెందిన తాటి శంకర రావు, శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభలు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందిగా వుంటుందని , ట్రాఫిక్ ఇబ్బందికి పరిష్కరించాలని , ఇందుకు పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. పోలీస్ , ఆర్టీసి శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్ , పోస్టర్ల ద్వారా తిరునాళ్ళ పై ప్రచారం నిర్వహించేందుకు సంబంధించి రూపొందించిన ప్రచార పోస్టర్ ను సబ్ కలెక్టర్ సంజనా సింహా సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో చేబ్రోలు తహశీల్దార్ ఏ. శ్రీనివాస వర్మ , యంపీడీఓ లలిత , విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస రావు , వేజండ్ల వెటర్నరీ అసిస్టెంట్ గోపి రాజు, గొడవర్రు , శలపాడు , వేజండ్ల , వడ్లమూడి , గుండవరం, చేబ్రోలు గ్రామాల సర్పంచ్ లు , పంచాయితీ సెక్రెటరీలు , వి ఆర్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *