గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, మెక్రో అబ్జర్వర్లు సమన్వయంతో వ్యవహరిస్తూ బాధ్యతగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడిండ్ అధికారులు, మైక్రో అభ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు జరిగే ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుంచి పూర్తి స్థాయిలో పోలింగ్ సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసుకొని పోలింగ్ రోజు ఉదయం 8 గంటల సమయానికి ఓటింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, మొదటి పోలింగ్ అధికారి, రెండవ పోలింగ్ అధికారి, మూడవ పోలింగ్ అధికారిగా నియమించిన ఓపీఓ లు వారికి నిర్దేశించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ అధికారులు, మైక్రో అభ్జర్వర్లు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయంలో జరుగుతున్న అన్ని విషయాలపై నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం స్పందిస్తూ పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు, ఇతర నాన్ స్టాట్యూటరీ, స్టాట్యూటరీ ఫారములను సక్రమంగా పూర్తి చేసుకొని, బ్యాలెట్ బాక్స్ లు సక్రమంగా సీజ్ చేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ తీసుకున్నప్పటీ నుంచి తిరిగి వాటిని రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే వరకు ప్రిసైడింగ్ అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేది నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు అందేలా పోస్ట్ ద్వారా కాని, స్వయంగా కాని అందించాలన్నారు. దరఖాస్తులు అందించిన వారి చిరునామాకు పోస్టల్ బ్యాలెట్ మెటీరియల్ పోస్ట్ ద్వారా అందించటం జరుగుతుందని, ఓటు నమోదు చేసి పోస్టల్ బ్యాలెట్ కవర్లు మార్చి 2వ తేది నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు చేరే విధంగా పోస్ట్ చేయాలన్నారు.
సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు, పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత బ్యాలెట్ పేపర్ వినియోగానికి సంబంధించిన ఫారాలు , ఇతర ఫారాలు పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల్లోనే పూర్తి చేసిన తరువాత మాత్రమే రిసెప్షన్ కేంద్రాలకు బయలుదేరి రావాలన్నారు. మైక్రో అభ్జర్వర్లు నిర్దేశించిన విధంగా పోలింగ్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ప్రిసైడింగ్ అధికారికి అవసరమైన సహాకారం అందించాలన్నారు.
సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులకు, మైక్రో అభ్జర్వర్లు నిర్వర్తించాల్సిన విధులు, బ్యాలెట్ బాక్సులు ఓటింగ్ కు సిద్ధం చేసే విధానం, సీల్ వేసే విధానంపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ , వీడియో చిత్రాల ద్వారా స్వయంగా బాలెట్ బాక్స్ తో సమగ్రంగా శిక్షణ ఇచ్చారు.
సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అభ్జర్వర్లుగా విధులు కేటాయించిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News