-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్ని భద్రత మరియు అగ్ని నిరోధకత చాలా ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అన్ని ఎస్టేట్, వి యం సి, జోనల్ కార్యాలయాల్లో పటిష్టమైన అగ్ని భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, 18 మీటర్ల కంటే తక్కువగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, మిక్స్డ్ ఆక్యుపెన్సి భవనాలు మరియు 15 మీటర్ల కంటే తక్కువగా ఉన్న కమర్షియల్ భవనాలు, స్కూల్స్, హాస్పిటల్స్ లలో ఫైర్ సేఫ్టీని పక్కాగా పరిశీలించాలని, అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహకారంతో సిబ్బందిని పెంచి నగరంలో పరిశీలించాలని చేయాలని రీజనల్ ఫైర్ ఆఫీసర్ని ఆదేశించారు.
బిల్డింగ్ కాంట్రాక్టర్స్ తో సర్కిల్ పరిధిలో సమావేశం నిర్వహించి, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొరిగేటట్టు చర్యలు తీసుకోవాలని, సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ వైర్లు రోడ్ల పైన వేలాడకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానని ఆదేశించారు. నగరంలో ఉన్న మైనర్, మేజర్ మీడియం డ్రైన్ లలో ఎప్పటికప్పుడు పూడికలు తీస్తూ, ఎన్ని వీధులలో పూడికలు తీశారు, ఎంత కిలోమీటర్ల దూరం తీశారు వంటి విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ మరియు సానిటేషన్ సిబ్బంది సహకారంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో తరచుగా వ్యర్ధాలు పడేసే ప్రదేశాలను ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వాహణ కోసం ఉన్న వాహనాలను మరమ్మతులు చేయించి అన్నీ వాడేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.
విధి వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి, వారికి కల్పించే రుణాలు, సదుపాయాలు వంటి అంశాలపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) ని ఆదేశించారు.
నగరంలో అవసరమైన ప్రతి చోట హరితాన్ని పెంచాలని మొక్కలను నాటాలని కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ ని ఆదేశించారు. ఆవులను రోడ్లమీద వదలకుండా యజమానుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్లు, ఆపరేషన్లు క్రమ తప్పకుండ చేస్తుండాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ను ఆదేశించారు.
ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని స్పోర్ట్స్ వసతులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, మరమ్మతులు ఉన్నచో అవసరమైనవి ఏమన్నా ఉన్నచో వెంటనే చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ డైరెక్టర్, ఎస్ ఈ (ప్రొజెక్ట్స్) ను ఆదేశించారు.
ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ పి సత్యకుమారి, సెక్రటరీ వసంతలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యుసిడి) పి వెంకటనారాయణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, ఇంచార్జ్ ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ లత, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, అకౌంట్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News