Breaking News

అక్కినేని నాగేశ్వరావు పార్క్ ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
10వ డివిజన్, పటమటలో నూతనంగా ఏర్పాటుచేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పటమట, పంట కాలువ రోడ్, బెంజ్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమటలలో దాదాపు 50 సెంట్లు విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కులో, కాలుష్యాన్ని తగ్గించే విధంగా కనులు విందులు చేసే వివిధ రకాల మొక్కలతోపాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ సౌకర్యాలతో ఆహ్లాద భరితంగా ఉంటుందని తెలిపారు. ఇంకాను ఏమన్నా పనులు ఉన్నచో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

బెంజ్ సర్కిల్, ఈనాడు, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. పంట కాలువ రోడ్లో, మాన్ హోల్ తెరిచి ఉండటం చూసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, వెంటనే మాన్ హోల్ ను మూసేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైన్ లను పరిశీలించి ఫ్లోటింగ్ గార్బేజ్ ను, ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలని అధికారం ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానెట్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *