Breaking News

గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

-క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులకు ఆదేశం
-మృతులకు సంతాపం ప్రకటించిన మంత్రి దుర్గేష్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లా నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందిన ఘటన కలచి వేసిందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మంత్రి దుర్గేష్ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం జీజీహెచ్ లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు.ఈ సందర్భంగా మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *