-రెవిన్యూ సమస్యలకు సకాలంలో పరిష్కరించండి…
-సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణ లో అలసత్వం వద్దు…
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
-కంకిపాడు మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త
భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కంకిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ భూ రికార్డుల నిర్వహణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు, రైతుల నుండి వివిధ సమస్యల పరిష్కారానికి సమర్పించే అర్జీలను నిర్ణీత గడువలోగా పరిష్కరించాలని అదేశించారు. ముఖ్యంగా రైతుల నుండి పట్టా దారు పాస్ పుస్తకాల మంజూరుకు సమర్పించే అర్జీలను ఏ స్థాయిలో పెండింగ్ ఉండరాదన్నారు. రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ( ఆర్ఎస్ఆర్), 1బి రిజిస్టర్, రికార్డు అఫ్ రైట్ (ఆర్ వో ఆర్), రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్వహణ లో అలసత్వం వద్దు….
సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణ సక్రమంగా ఉండాలని అదేశించారు. పునాదిపాడు లోని చెత్త నుండి సంపద తయారీ కేందాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భగా అయన మాట్లడుతూ సేకరించిన పొడి తడి చెత్తను ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద వేరు చేసి తడి చెత్త ను కంపోస్ట్ ఎరువుగా మార్చి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలని అన్నారు. ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తనిఖీలలో కంకిపాడు తహసీల్దార్ బావ నారాయణ, డిప్యూటీ తహశీల్దార్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది ఆన్నారు.
Prajavartha Online Telugu News