Breaking News

పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో మార్చి 1వ తేదీ నుండి రోడ్ల మీద వ్యర్ధాలు వేసే కమర్షియల్ సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని, స్వచ్చ గుంటూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, కార్యదర్శులతో పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాల సేకరణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా వ్యర్ధాల సేకరణ ఏజన్సీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ప్రతి కమర్షియల్ సంస్థ నుండి సదరు ఏజన్సీనే వ్యర్ధాలు సేకరణ చేయాలని, ప్రజారోగ్య కార్మికులు చేయడానికి వీలు లేదన్నారు. బుధవారం నుండి వార్డ్ సచివాలయం పరిధిలో ప్రతి సంస్థకు వ్యర్ధాలను సేకరణ సంస్థలకే ఇవ్వాలని, రోడ్ల మీద వేస్తె మార్చి 1వ తేదీ నుండి భారీ మొత్తంలో అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని అవగాహన కల్గించాలని ఆదేశించారు. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇళ్లల్లో వారు కూడా ప్రజారోగ్య కార్మికులకే వ్యర్ధాలను అందించాలని, రోడ్లు, డ్రైన్లు, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేస్తె అపరాధ రుసుం విధించడం జరుగుతుందని, సదరు అంశాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ నెల 25 నాటికి కార్మికుల రేషనలైజేషన్, ట్రాక్టర్లు, కాంపాక్టర్లు, పుష్ కాట్స్, ఈ-ఆటోలు, బిన్స్ కేటాయింపు పూర్తి చేయాలని సిఎంఓహెచ్, ఎంహెచ్ఓలను ఆదేశించారు. అలాగే మార్చి 1వ తేదీ నుండి 30 మంది కార్మికులతో 2 బృందాల ద్వారా నగరంలో క్విక్ యాక్షన్ టీం లను ఏర్పాటు చేస్తామని, పారిశుధ్య సమస్యలపై అందే ఫిర్యాదులను గంటల వ్యవధిలో పరిష్కారానికి సదరు టీం ల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో సిఎంఓహెచ్ఓ డాక్టర్ పిజె అమృతం, ఎంహెచ్ఓ రవిబాబు, వెటర్నరీ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎంహెచ్ఓలు రాంబాబు, ఆనందకుమార్, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *