గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., వారు రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం మంగళవారం ఆకస్మికముగా తుళ్ళూరు మండలము, వడ్డమాను గ్రామము నందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు. తదుపరి రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దును పరిసీలించి గ్రౌండ్ ట్రుతింగ్ కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపటమును మరియు ఓఆర్ఐ షీట్లను పరిశీలించి ఉన్నారు. తదుపరి సంబందిత గ్రామ సర్వేయర్లకు, గ్రామ రెవెన్యూ అధికారులకు రీసర్వే మీద తగు సూచనలు చేసినారు మరియు సర్వే ప్రక్రియ త్వరితగతిన అయ్యేటట్లుగా ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయ వలసినదిగా ఆదేశించినారు. ఈ కార్యక్రమమునకు జాయింట్ కలెక్టర్ గుంటూరు వారితో పాటు తుళ్ళూరు మండల తహసిల్దారు సుజాత, సర్వే సహాయ సంచాలకులు (AD), డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, మండల సర్వేయరు, గ్రామ సర్వేయర్లు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు హాజరైనారు.
Prajavartha Online Telugu News