Breaking News

వ్యాధి రాకుండా కోళ్ళ ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బార్డ్ ఫ్లూ గురించి జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం సంయుక్త సంచాలకులు , పశు సంవర్ధక శాఖ, గుంటూరు వారి కార్యాలయంలో కోళ్ళ ఫారం యజమానులకు సమావేశము నిర్వహించి వ్యాధి రాకుండా కోళ్ళ ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అనగా వ్యక్తి గత పరిశుబ్రత, షెడ్ లలో నలుమూలల శానిటైజర్ ద్రావణాలను వాడుకొంటూ సిబ్బంది చేతులను పరిశుభ్రంగా ఉంచుకొనవలెనని. ఫారంలలో వాడే నీటి తోట్టెలు ధాన తోట్టెలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పరిశుబ్రంగా ఉంచుకొనవలెనని. కోళ్ళ విసర్జితలాను ఎప్పటికప్పుడు తీసివేయవలెనని. ఫారంల లోనికి బయటి వ్యక్తులను మరియు వాహనాలను అనుమతించకుండా జాగ్రత్తలను పాటించవలెనని తెలియజేయదమైనది. ఈ సందర్బంగా కోడు గుడ్లను మరియు కోడి మాంసంను బాగా ఉడికించి తినడం వలన ఈ వ్యాధి సంక్రమించదని డా. ఒ.నరసింహారావు , సంయుక్త సంచాలకులు, గుంటూరు వారు ప్రజలకు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *