Breaking News

ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
PMDS నవధాన్య సాగు ప్రతి రైతుకి చేరువ కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ .భార్గవ తేజ I.A.S ఆధ్వర్యంలో జరిగినటువంటి…ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో పాల్గొని వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడినారు”నేను కూడా మా గార్డెన్ లో PMDS విత్తనాలు వేస్తా ” జిల్లా సంయుక్త కలెక్టర్ రైతు విజయ లక్మి అనుభవాల తో ఏకీభవించారు.

18.02.2025 రోజున DRC మీటింగ్ హల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక కలెక్టర్ అధ్యక్షత వహించారు. వచ్చే రెండు నెలలలోపు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామ సంఘాలలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అందరు రైతులకు అవగాహన నిర్వహించి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మరియు DRDA శాఖలు కలిసి APCNF సిబ్బంది తో కలిసి మంచి సమన్వయం తో పూర్తి చేయాలని. జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు గారు ఉద్గాటించారు…PMDS తో ఎరువులు తగ్గించి, ప్రకృతి వ్యవసాయం కొంత ఏరియా లో అయిన మొదలు పెట్టాలని తెలియజేసారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి ప్రకృతి వ్యవసాయం లో ప్రగతి, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఉద్దేశం గురించి మొదటగా వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, DRDA PD విజయ లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక అధికారి నరసింహారావు కూడా ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సమన్వయం తో పూర్తి చేస్తామని తెలియ జేశారు. రైతులు వట్టిచెరుకూరు ధనుంజయ రావు, అత్తోట బాపయ్య, ఎరుకులపూడి విజయ లక్ష్మి ప్రకృతి వ్యవసాయం లో అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం లో APCNF ..అదనపు డీపీఎం… మరియు సిబ్బంది, ADA లు MAO లు, DRDA DPM లు, APM లు హాజరు అయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *