-కనకదుర్గనగర్, కరెన్సీ నగర్లలో గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాము ఎక్కడికెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించిన పట్టభద్రులంతా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని, ఆలపాటి రాజా విజయం తథ్యమని మెజారిటీ పెంచేందుకు పట్టభద్రులు ఆలపాటికి అండగా ఉండాలన్నారు. మంగళవారం ఉదయం 3వ డివిజన్ పరిధిలోని కనకదుర్గ నగర్ పార్కు, కరెన్సీ నగర్ పార్కులలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె క్రాంతి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు పక్కన ఒకటి అంకె ను వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలన్నారు. ఈ సందర్భంగా స్థానికలతో కొంత సమయంలో పిచ్చాపాటిగా మాట్లాడి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నారా లోకేష్ నాయకత్వంలో మెగా డీఎస్సీ నిర్వహణ ఉంటుందని, దానితోపాటు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబునాయుడు విజన్ తో ఈ రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు నాలుగు లక్షల 70 వేల ఉద్యోగల కల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిస్తే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముఖ్య భూమిక పోషించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాడి బాబురావు, గద్దె రమేష్, కృష్ణ ప్రసాద్, గుత్తికొండ కృష్ణ మోహన్, బండి సాయి కోమలి, నాగబాబు, కొత్తపల్లి హరీష్ బాబు, దండమూడి సన్నిధి, షేక్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News