Breaking News

పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి సంబందించి గుంటూరు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన ప్రభావిత భవనాల తొలగింపు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, టిడిఆర్ బాండ్లు, నష్ట పరిహారాల పంపిణీ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమీషనర్ తమ చాంబర్ లో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు శంకర్ విలాస్ ఆర్ఓబి పనులపై జిఎంసి చేపట్టాల్సిన పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిఎంసి నుండి చేపట్టాల్సిన రోడ్ విస్తరణ పనులను, ప్రభావిత భవనాల తొలగింపు పూర్తి చేయాలన్నారు. భవనాల తొలగింపు అనంతరం ఇరువైపులా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడానికి అంచనాలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 26 మందికి తాము కోల్పోతున్న భవనాలకు సంబందించి నష్ట పరిహారం అందించడానికి ప్రతిపాదనలు 25వ తేదీకి పూర్తి చేయాలని ఎస్ఈని ఆదేశించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో టిడిఆర్ బాండ్లు ఇవ్వాల్సిన వాటికి ప్రాసెస్ మొదలు పెట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. తొలుత ఇంజినీరింగ్ విభాగంలో అధికారుల వారీగా పెండింగ్ లో ఉన్న ఈ-ఆఫీస్ ఫైల్స్ ని 2 రోజుల్లో క్లియర్ చేయాలని, డిఈఈలు, ఈఈలు భాధ్యత తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, డిఈఈలు, ఏఈలు, టిపిఎస్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *