Breaking News

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలి…

మచిలీపట్నం/ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

కృష్ణ- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియలో బాగంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజ్, ఉయ్యూరు, రెవిన్యూ డివిజన్ల కార్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ రావు తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పక్రియలో కీలక ఘట్టం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల నుండే ప్రారంభం అవుతుందన్నారు. ఇక్కడ నుండే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేస్తారన్నారు. ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో నాలుగు కౌంటర్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు.
ఈనెల 27 గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 77 పోలింగ్ కేంద్రాల్లో 63,114 మంది అర్హత కలిగిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్నారు. జిల్లాలో ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు వీలుగా 11 సెక్టార్లుగా విభజించామన్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, నోబుల్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ నుండి ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నిక సామాగ్రి తరలించడం జరుగుతుందన్నారు.
మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలో 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో మచిలీపట్నం గూడూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు, అవనిగడ్డ, నాగాయలంక కోడూరు లో ఐదు పోలింగ్ కేంద్రాలు, ఘంటసాల, చల్లపల్లి మోపిదేవిలో ఆరు పోలింగ్ కేంద్రాలు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను లో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ వివారించారు.

ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన 25 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను ఉంచేందుకు వీలుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావులు పరిశీలించారు.
ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని,వీటిలో తాడిగడప మున్సిపల్ పరిధి, పెనమలూరు మండలాల్లో 11 పోలింగ్ స్టేషన్లు, కంకిపాడు ఉయ్యూరు తోట్లవల్లూరు మండలాల్లో 8 పోలింగ్ స్టేషన్లు, పామర్రు మొవ్వ పమిడిముక్కల మండలాల్లో ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రంలో నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేయనున్నామని కలెక్టర్ అన్నారు. పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు వీలుగా సెక్టార్ రూట్ వారిగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిధిలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించామని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సిబ్బంది కాకుండా ఇతరులు ఎవరిని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలలో అనుమతించేది లేదని అన్నారు.
రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలనుండి పోలింగ్ స్టేషన్ కు బాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి తరలించే వాహనాల ఎస్కార్ట్ గా సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, నలుగురు ఏఆర్ గాడ్స్ తో బందోబస్తీ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర తెలిపారు.
కేంద్రాల పరిశీలనలో మచిలీపట్నం ఆర్డిఓ కె.స్వాతి, ఉయ్యూరు ఆర్డిఓ బి.ఎస్ హేలా షరన్, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *