విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖామంత్రి హర్ దీప్ సింగ్ పూరికి మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పై పాత్రికేయుల సమావేశం నోవాటెల్ హోటల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన హర్ దీప్ సింగ్ పూరికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News