గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థకు చెందినా షాపుల అద్దెలు మార్చి నాటికి నూరు శాతం చెల్లించాలని, బాకీలున్న షాపులను సీజ్ చేయడానికి రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక లీలా మహాల్ ఎదురుగా గల నగర పాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల లీజు దారులు 2024-25 ఏడాదికి సంబంధించిన అద్దె మొత్తాన్ని కమీషనర్ ఛాంబర్ లో కమీషనర్ గారికి అందజేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, లీలా మహల్ ఎదురు ఉన్న నగర పాలక సంస్థ 21 షాపుల లీజుదారులు పూర్తి అద్దె రూ. 10,99,245 చెల్లించారని, అలాగే మిగిలిన షాపింగ్ కాంప్లెక్స్ వాళ్లు కూడా అద్దెలు చెల్లించి నగరాభివ్రుద్దిలో భాగస్వాములు కావాలన్నారు. సకాలంలో అద్దెలు చెల్లించని షాపులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కాంప్లెక్స్ ల వారీగా షాపుల అద్దెలు, బకాయిల పై వివరాలు తీసుకున్నామని, మార్చి 1 నుండి సమగ్ర యాక్షన్ ప్లాన్ చేపడతామన్నారు. సదరు కార్యక్రమంలో ఆర్.ఓ షాదిక్ బాషా, ఆర్.ఐ కాశియ్య, షాపుల లీజు దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News