గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాసిక్ వినియోగం, విక్రయంపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంటుందని, ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా నగర ప్రజలు, వ్యాపార సంస్థలు నిషేధంపై నగరపాలక సంస్థకు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ (అమెండ్మెంట్ రూల్స్) 2021 ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, నాన్ ఓవెన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ (చదరపు మీటర్ కి 60 గ్రాముల కన్నా తక్కువ బరువు) ఉత్పత్తి, స్టోర్ చేయడం, వినియోగం, విక్రయాన్నికేంద్ర పర్యావరణ శాఖ నిషేధించిందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కూడా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ స్టిక్స్ ఉన్న బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, అలంకరణ కోసం వినియోగించే ధర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గ్లాసులు, ఫోర్క్, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్స్ ల్లో ప్యాకింగ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డ్ లు, సిగరెట్ ప్యాకెట్స్, 100 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కల్గిన ఫ్లెక్సీ బ్యానర్లు, స్టిర్రర్స్ వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధం అమలులో ఉంటుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన పలు రకాల క్యానర్స్, సంతాన ఉత్పత్తి సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, ప్రజారోగ్య, పర్యావరణ రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిషేధంకు సహకరించాలని కోరారు. నిషేద నిబందనలు ఉల్లంఘన చేసే వారే పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News