Breaking News

కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు ప్రతి నెల వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని, గ్రీవెన్స్ లో అందే ఆర్జీలను, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విభాగాదిపతులకు స్పష్టం చేశారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ ల సమస్యలపై గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, విభాగ సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *