-అన్ని విధాలుగా సహకరిస్తాం వీసీతో కలెక్టర్ ప్రశాంతి
-పరస్పర సహకారం తో పని చేద్దాం వీసీ ప్రసన్న శ్రీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా నియమితులైన ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ జిల్లాకు ప్రతిష్టాత్మక మైన ఆదికవి నన్నయ యూనివర్సిటీకి డైనమిక్ ఉమెన్ వీసీగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలు పరిష్కరించి విశ్వ విద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. దానికి కావలసిన సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుండి అందిస్తామని తెలియజేశారు. విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రయోజనకరమైన , ఆర్ధిక స్వావలంబన కోసం నూతన కోర్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. మహిళా సాధికారత కు సంబంధించిన అంశాలపై కలిసి పని చేద్దామని వీసీ ప్రసన్న శ్రీ ఈ సందర్భంగా తెలియజేశారు.
Prajavartha Online Telugu News