-పి.బి.సిద్ధార్థ ఆర్థికసదస్సులో ఆచార్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న జనాభాకి తగిన నిష్పత్తిలో భూవిస్తీర్ణం పెరగదని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల విస్తీర్ణం పెంచుకొని ఆహారకొరతను అధిగమించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ఆచార్యులు డాక్టర్ సి.ఎస్.ఎన్.రాజు అన్నారు. శనివారం ఉదయం విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆర్ధికశాస్త్ర విభాగం జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఇతర సాంకేతికత ద్వారా డ్రాగన్ ఫ్రూట్స్ తరహా నూతన ఫలాలు మరిన్ని కనుగొనాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు ఆవిష్కరణలు దోహదపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయం- గ్రామీణ అభివృద్ధి అంశంపై పరిశోధన పత్రాలతో వెలువరించిన ఇన్నోవేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంటు ప్రత్యేక సంచికను ముఖ్య అతిథి ప్రొఫెసర్ సి.ఎస్.ఎన్.రాజు, కళాశాల ప్రిన్సిపాల్, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ మేకా రమేష్, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.రోహిణి కుసుమ, డా. సూర్యప్రకాశరావు, ఎన్.రామారావు, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News