Breaking News

ఉపాధ్యాయులకు సత్కారం

-ఫ్యూచర్ పాత్ స్కూల్ ఓపెన్ ఇంటర్ విద్యార్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కేదరాజేశ్వరి పేట ఫ్యూచర్ పాత్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ విద్యను అభ్యశించి నేటితో (ఆదివారం) క్లాసులు ముగిసిన సందర్బంగా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి శాలువాలు కప్పి సత్కారం చేశారు. 10వ తరగతితో చదువులు నిలిపివేసి కొన్ని సంత్సరాలు గడిచినప్పటికి పై తరగతులు చదవలేదనే బాధను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ APOSS ద్వారా పై చదువులు పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించడం మంచి పరిణామన్నారు. తమ కోసం ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠాలు బోధించిన అధ్యాపకులను సత్కరించుకుని వారి దీవెనలు తీసుకున్నారు. సులభతరంగా అర్ధం చేసుకునేలా ఆదివారం, రెండవ శనివారంలు తరగతులు నిర్వహించి పాఠ్యాంశాలను బోధించిన ఉపధ్యాయులకు, ఫ్యూచర్ పాత్ స్కూల్ యాజమాన్యంకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ కూడ చక్కగా చదివి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తిర్ణితులు కావాలని, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయలు విద్యార్థులను దీవించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *