రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలు ఓటింగ్ ఫిబ్రవరి 27 న జరుగుతున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ ప్రవేటు ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ర్ట ప్రభుత్వ పాఠశాల విద్య కమిషనర్ ఆ రోజు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా పాఠశాల విద్య అధికారి కె వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, మరియు అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ యాజమాన్యముల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు తెలియజేయునది ఏమనగా గౌ.డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎ.పి., అమరావతి వారి ఆదేశముల ప్రకారము తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్.ఎల్.సి ఎలక్షన్ సందర్భముగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ యాజ మాన్యముల పాఠశాలలకు తే.27.02.2025 ది నాడు శలవుదినము గా ప్రకటించడమైనది.
Tags rajamandri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News